విశాఖలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం | YS Jagan mohan reddy gets a grand welcome at Visakhapatnam Airport | Sakshi
Sakshi News home page

విశాఖలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

Jun 11 2014 8:55 AM | Updated on Jul 25 2018 4:09 PM

విశాఖలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం - Sakshi

విశాఖలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు.

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, నేతలు,అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ రెండు రోజుల పాటు సమీక్ష జరుపుతారు.

బుధవారం తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా ఆయన సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement