త్యాగానికి, దైవత్వానికి ప్రతీక: జగన్‌ | YS Jagan Bakrid's wishes to Muslims | Sakshi
Sakshi News home page

త్యాగానికి, దైవత్వానికి ప్రతీక: జగన్‌

Oct 16 2013 2:56 AM | Updated on Jul 25 2018 4:09 PM

త్యాగానికి, దైవత్వానికి ప్రతీక: జగన్‌ - Sakshi

త్యాగానికి, దైవత్వానికి ప్రతీక: జగన్‌

రాష్ట్రంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముస్లింలకు జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నమన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని జగన్ ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement