రాజోలి నిర్మిస్తాం

YS Avinash Praja Darbar in YSR Kadapa - Sakshi

ప్రజాదర్బార్‌లో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ఎంపీకి పలువురి వినతులు,  అభినందనలు..

కడప కార్పొరేషన్‌: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి సోమవారం కడపలో బిజీ బిజీగా గడిపారు. సోమవారం ఉదయం 7 గంటలకే కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత జర్నలిస్టులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజా దర్భార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  వైఎస్సార్‌సీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన రాజోలి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసేందుకు నివేదికలు సిద్ధం చేయాలని,అలాగే  కుందూ–సర్వరాయసాగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల పూర్తికి ప్రణాళికలు తయారు చేయాలని తెలుగుగంగ ఎస్‌ఈ  శారదను ఆదేశించారు. విజయవాడలో ఈనెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్న స్వరూపానందస్వామి బాల సన్యాస దీక్ష కార్యక్రమానికి హాజరు కావాలని ఏíపీ బీఎస్‌ఎస్‌ఎస్‌ నాయకులు ఎంఎల్‌ఎన్‌ సురేష్‌బాబు, సత్యనారాయణ శర్మ ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు. తొలుత ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కడపలోని జర్నలిస్టులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కడపలోని ప్రధాన సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు, మౌలిక వసతుల  కల్పన వంటి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీని కలిసిన ఆర్‌కే వ్యాలీ మెంటార్స్‌
పదేళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని ట్రిపుల్‌ ఐటీ ఆర్‌కే వ్యాలీకి చెందిన మెంటార్స్‌ కోరారు. సోమవారం వారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2008లో తాము అపాయింట్‌అయ్యామని, తమకంటే వెనుక 2011, 2017లో నియమితులైన వారికి ఎక్కువ జీతభత్యాలు ఇస్తున్నారని, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమకు మాత్రం రూ.33వేలే ఇస్తున్నారని వాపోయారు. తమ సర్వీసును రెగ్యులర్‌ చేయాలని హైకోర్టును ఆశ్రయించినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సర్వీసును బ్రేక్‌ చేయడానికే కొత్తగా ఇంటర్వ్యూకు రమ్మని పిలుస్తున్నారని తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మెంటార్స్‌ సర్వీసులో ఒక్క రోజు కూడా నష్టం కలగకుండా న్యాయం జరిగేలా చూస్తామని, అవసరమైతే స్పెషల్‌ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఖాజీపేట మండలం సన్నపల్లెకు చెందిన టీ. రవీంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన తాము పండించిన పసుపు పంటను ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి చూపి గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్వింటాకు రూ.16,500 ఉండేదని, ప్రస్తుతం మూడు వేలు కూడా లేదని తెలిపారు. కనీసం క్వింటాకు రూ.8వేలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

అభినందనల వెల్లువ
కడప పార్లమెంటు సభ్యుడిగా మూడు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించి మొదటిసారి కడపకు వచ్చిన వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పలువురు అధికారులు, అనధికారులు అభినందనలు తెలిపారు. పోలీసు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, జిల్లా కార్యదర్శి యోగా రాయల్, పంచాయితీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బారెడ్డి, మెప్మా పీడీ ఎన్‌. రాధ, ఏíపీట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసులు, డీటీ శోభా వాలంటీనా, డీఈ జగన్‌మోహన్‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రనాథ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, ఎస్టీ సెల్‌ జిల్లా అ«ధ్యక్షుడు వేణుగోపాల్‌నాయక్, మహిళా నేతలు బోలా పద్మావతి, టీపీ వెంకటసుబ్బ మ్మ, రత్నకుమారి, 21వ డివిజన్‌ ఇన్‌చార్జి ఐస్‌క్రీం రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, బీసీసెల్‌ జిల్లా అ«ధ్యక్షుడు బంగారు నాగయ్య, వల్లూరు జెడ్పీటీసీ వీరారెడ్డి, కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, చల్లా రాజశేఖర్, రామలక్ష్మణ్‌రెడ్డి, బండిప్రసాద్, మదన్, ఆలూరు ఖాజా, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఎంపీని కలిసి పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జమ్మలమడుగు కన్నెలూరుకు చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు డి. శ్రీనివాసులు యాదవ్‌ ఎంపీని కలిశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top