యువకుడి దారుణ హత్య | youth murdered in ananthapur district | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Nov 1 2015 9:26 AM | Updated on Sep 18 2019 3:26 PM

ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి పై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బండరాళ్లతో హతమార్చారు.

అనంతపురం: ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి పై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బండరాళ్లతో హతమార్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామంలో  జరిగింది.

గ్రామానికి చెందిన వన్నూరు స్వామి(26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement