వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
సాక్షి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 21న జిల్లాలోని బనగానపల్లె నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అదే రోజు ఆళ్లగడ్డలోనూ ప్రచారం నిర్వహించనున్నారు.
22న నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు.. 23న డోన్, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రచారం చేపట్టనున్నారు. మూడు రోజుల పర్యటనకు పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలనే విషయంపై జిల్లా పార్టీ క న్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమానాగిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. విజయమ్మ పర్యటన కోసం జిల్లా ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.