ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ తప్పుడు సర్టిఫికెట్లను సమర్పించిన వారిపై నమోదైన కేసుల్లో బుధవారం జే సీ ఎల్.శర్మన్ తన చాంబర్‌లో
తప్పుడు సర్టిఫికెట్లపై విచారణ
Oct 10 2013 2:24 AM | Updated on Sep 1 2017 11:29 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ తప్పుడు సర్టిఫికెట్లను సమర్పించిన వారిపై నమోదైన కేసుల్లో బుధవారం జే సీ ఎల్.శర్మన్ తన చాంబర్‌లో విచారణ చేపట్టారు. వడ్డేపల్లి మండలానికి చెందిన నారాయణ బుడగ జంగమంటూ తీసుకున్న సర్టిఫికెట్‌తోపాటు కొత్తూరులోని దర్శన్ క్రిస్టియన్‌గా మారి ఎస్సీగా నమోదైన తీరుపై ఆయన ఆరా తీశారు. వీటిపై పూర్తిస్థాయిలో అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసులను నవంబర్ 30కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణలో తప్పుడు కులం సర్టిఫికెట్లు పొంది ఉద్యోగం సంపాదించినట్టు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అనంతరం రేషన్ డీలర్లకు సంబంధించి నమోదైన రెండు 6ఏ కేసులపై జే సీ విచారణ చేపట్టారు. వీటిపై తమ వాదనలు వినిపించాలని బాధితులకు సూచిస్తూ తదుపరి తేదీకి వాయిదా వేశారు. అలాగేటెనెన్సీ కేసును విచారించిన జేసీ తదుపరి తేదీకి వాయిదా వేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాంకిషన్, బీసీ వెల్ఫేర్ అధికారి సంధ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement