ప్రొడక్టు డిజైన్‌పై గీతంలో వర్క్‌షాప్‌

Workshop On Product Design In Gitam Deemed University Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొడక్టు డిజైన్‌పై నిర్వహించే మూడురోజుల వర్క్‌షాప్‌ గురువారం మొదలైంది. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 12,13,14తేదీలలో వర్క్‌షాపు జరగనుంది. వర్క్‌షాప్‌ రిసోర్స్‌ పర్సన్‌గా న్యూజెర్సీలోని బెక్టాన్‌ డికిన్‌సన్‌ సంస్థ పరిశోధన-అభివృద్ధి విభాగం నిపుణుడు పాల త్రివిక్రమ్‌ భానోజీ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలోచనలకు రూపం ఇ‍వ్వడంలో ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ పాత్ర కీలకమన్నారు. ఇందుకోసం క్యాడ్‌, కామ్‌ సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే వినియోగదారులకు అవసరమైన విధంగా ఉత్పత్తులు అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ కె. లక్ష్మీప్రసాద్‌, హెచ్‌ఓడీ సత్యనారాయణ, ప్రొగ్రామ్‌ కన్వీనర్లు ఆర్‌.భానుపవన్‌, కోదండరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top