లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి | Women killed in lorry accident at kurnool district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

Feb 5 2014 8:42 AM | Updated on Sep 2 2017 3:22 AM

కర్నూలు జిల్లా డోన్ మండలం యు. కొత్తపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ నలుగురు మహిళలను ఢీ కొట్టింది.

కర్నూలు జిల్లా డోన్ మండలం యు. కొత్తపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ నలుగురు మహిళలను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో గాయపడిన మహిళలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్కు తరలించారు. మృతి చెందిన ఇద్దరు మహిళ మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement