వివాహితపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
ఖమ్మంలో వివాహితపై యాసిడ్ దాడి
Nov 26 2013 3:23 PM | Updated on Aug 17 2018 2:10 PM
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కుటుంబ కలహాలే దాడికి కారణమని తెలుస్తోంది. ఇంట్లోకి సరుకులు కొనేందుకు ఖమ్మం పట్టణానికి వచ్చిన మహిళపై ప్లాన్ ప్రకారం నిందితుడు యాసిడ్ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
Advertisement
Advertisement