బస్టాండ్‌లో పర్సు లాక్కెళ్లారు.. | Woman waiting for bus in cheerala bus stand robbed of wallet | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో పర్సు లాక్కెళ్లారు..

Apr 27 2015 3:34 PM | Updated on Aug 30 2018 5:27 PM

బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ చేతిలోనుంచి పర్సు లాక్కొని పోయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల బస్‌స్టాండ్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ప్రకాశం : బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ చేతిలోనుంచి పర్సు లాక్కొని పోయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల బస్‌స్టాండ్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుంతలమర్రికి చెందిన జ్యోతి అనే మహిళ చీరాల వెళ్లింది.

 

సోమవారం ఆమె తిరిగి ఇంటికి బయలుదేరడానికి బస్‌స్టాండ్‌లో నిల్చున్న సమయంలో ఓ దుండగుడు ఆమె చేతిలోనుంచి పర్సు లాక్కొని పారిపోయాడు. వెంటనే ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పర్సులో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక సెల్‌ఫోన్ ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement