ఉన్మాది చేతిలో మహిళ హతం | Woman killed by ex-husband at prakasam district | Sakshi
Sakshi News home page

ఉన్మాది చేతిలో మహిళ హతం

Jan 26 2015 11:35 PM | Updated on Sep 2 2017 8:18 PM

ఉన్మాది గొడ్డలితో ఒక మహిళను కిరాతకంగా నరికి చంపాడు.

చీరాల టౌన్(ప్రకాశం): ఉన్మాది గొడ్డలితో ఒక మహిళను కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని వడ్డె నాగేశ్వరరావునగర్‌లో సోమవారం రాత్రి 9 గంటలకు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భర్త నుంచి విడాకులు తీసుకొని తల్లితో కలిసి ఉంటున్న పిచ్చుల మల్లిక(33)ను పక్కింటికి చెందిన కన్నెమ్‌రెడ్డి వెంకటేశ్వర్లు(అలియాస్ చిన్నా) గొడ్డలితో నరికి చంపాడు. జులాయిగా తిరిగే చిన్నా మల్లికతో చిన్నచిన్న తగాదాలు పెట్టుకునేవాడు.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిండి రుబ్బుతున్న మల్లికపై వెనుక నుంచి వచ్చి దాడి చేసి హతం చేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు మల్లికకు పదేళ్ల కుమార్తె ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement