రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | woman died in road accident at ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Jan 13 2016 6:00 PM | Updated on Aug 30 2018 3:58 PM

వైఎస్సార్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.

రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె వద్ద బైక్పై వెళ్తున్న వారిని ఓ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన డి.రోజా(34) తన అక్క కుమారుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా స్థానిక మార్కెట్ యార్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో రోజా అక్కడికక్కడే చనిపోగా ఆమె బంధువు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement