రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | woman dead in road accident at vizianagaram district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Dec 22 2015 8:38 AM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

భోగాపురం: విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

విశాఖపట్టణం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భోగాపురం మండలం మహారాజుపేట పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చనిపోగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement