
కంచికచర్ల (నందిగామ) : ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి చీరెతో దూ లానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కంచికచర్లలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక మోడల్ కాలనీకి చెందిన వల్లంశెట్టి అంజిలి (17) ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ చిల్లర దుకాణంలో పని చేస్తుంది. తల్లి మోడల్ కాలనీలో సమోసాలు తయారు చేస్తుంటుంది. అయితే ఒంట్లో బాగోలేదని అంజిలి పనికి వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్యహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న సీఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్‌ఐ సందీప్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.