నందిగామ: కూటమి సర్కార్ కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. వీరులపాడు మండలం కొణతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చివేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మారినందుకు ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగారు టీడీపీ నేతలు.
పార్టీ మారిందనే కోపంతో షేక్ సైదాబి ఇంటిని కూల్చివేశారు. 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో నివాసముంటుంది షేక్ సైదాబి కుటుంబం. ఎప్పట్నుంచో ఉన్న ఇంటిని కూల్చివేయడంతో షేక్ సైదాబి, ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటిని కూల్చివేయడంతో పాటు ఆమెకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.


