సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్యనాయుడు | Will propose amendments to Telangana Bill in Parliament: BJP | Sakshi
Sakshi News home page

సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్యనాయుడు

Jan 30 2014 2:29 AM | Updated on Jun 18 2018 8:10 PM

సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్యనాయుడు - Sakshi

సవరణలు ప్రతిపాదిస్తాం: వెంకయ్యనాయుడు

సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందనీ... పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లుకు పార్టీ సవరణలు ప్రతిపాదిస్తుందనీ.. అందరికీ న్యా యం జరగాలని కోరుకుంటున్నామనీ ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు వెల్లడించారు.

సాక్షి, విజయవాడ: సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందనీ... పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లుకు పార్టీ సవరణలు ప్రతిపాదిస్తుందనీ.. అందరికీ న్యా యం జరగాలని కోరుకుంటున్నామనీ ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు వెల్లడించారు. విజయవాడలో బుధవారం ‘ప్రధానిగా నరేంద్రమోడీ’ ప్రచార  కార్యక్రమం ప్రారంభం సందర్భంగా స్వరాజ్ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాల్సింది పోయి ప్రజలను రెండుగా చీల్చి చిచ్చుపెడుతున్నారని విమర్శించారు.
 
  తెలంగాణలో వెయ్యి మంది యువకులు చనిపోయారని, సీమాంధ్రలో 350 మంది వరకు ఆత్మార్పణ చేసుకున్నారని.. వీరి మరణాలకు కాం గ్రెస్ పార్టీ కారణం కాదా? ‘ఇప్పు డు మాట్లాడుతున్న మాటలను సీఎం కిరణ్ ఆనాడు సీడబ్ల్యుసీలో ఎందుకు మా ట్లాడలేదు? ఆ రోజే పార్టీ ఆయన మాటలను వినకపోతే కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు రాలేదు?’ అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉండి విభజన చేయాల్సిన పరిస్థితి వస్తే జనానికి నమ్మకం కలిగించి ఉండేవాళ్లమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మద్దతు ఇప్పుడు కాం గ్రెస్‌కు లేదని, ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల్లో ఇది రుజువైందన్నారు. కమ్యూనిస్టులు ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటారు కానీ,వారు మాత్రం ఏకంకారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement