ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం

Will fight for the public welfare : ysrcp - Sakshi

ఉండి : ప్రజా సంక్షేమం కోసం ఎందాకైనా పోరాడతామని, భయపడేది లేదని ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ పీవీఎల్‌ నర్సింహరాజు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఆదివారం చిలుకూరులో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. పార్టీని అభిమానిస్తున్న వారిపై టీడీపీ నాయకులు కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌ సీపీని అభిమానించి బ్యానర్‌లు వేస్తుంటే బ్యానర్‌లో ఉన్న వారి ఫొటోలను, పేర్లను సేకరించి బెదిరింపులకు దిగుతున్నారని పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ పీవీఎల్‌ నర్సింహరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధినేత ప్రజా సంక్షేమం కోసం దేనినైనా ఎదిరించి ఏ విధంగా అయితే ముందడుగు వేస్తున్నారో అలాగే ఆయనను అభిమానించే ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తామన్నారు. ఎవరైనా భయపెట్టాలని చూసినా, అక్రమంగా కేసులు బనాయించినా తాను ముందుంటానని కార్యకర్తలు, అభిమానులకు నర్సింహరాజు భరోసా ఇచ్చారు.

 పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాతపాటి సర్రాజు మాట్లాడుతూ దివంగత రాజశేఖరరెడ్డి పరిపాలనలో అన్నివర్గాల ప్రజలు, అన్నివృత్తుల వారు సుఖసంతోషాలతో ఉన్నారని ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో అన్నివర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్‌(బాబు), మండల పార్టీ అధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, జిల్లా నాయకులు అల్లూరి వెంకట్రాజు, జి.సుందర్‌కుమార్, మద్దా అభిషేక్, అంగర రాంబాబు, మునుకోలు సింహాచలం, కరిమెరక చంద్రరావు, ఎంపీటీసీ వర్రే పైడియ్య, బందెల ప్రమీల, కొరపాటి అనిత తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top