ఇక టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్

ఇక టీచర్లకు  వెబ్ కౌన్సెలింగ్


ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి వెబ్ కౌన్సెలింగ్     విధానంలో బదిలీలు     చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల కానుం ది. ఈలోగా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయమని రాష్ట్ర విద్యాశాఖ నుంచి     ఆదేశాలు అందినట్లు విద్యాశాఖ సిబ్బంది తెలిపారు.

 

చిత్తూరు (గిరింపేట):జిల్లాలో 16వేల ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, సుమారు 4వేల మంది బదిలీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. రెండేళ్ల నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు స్థానచలనం పొందనున్నారు. బదిలీ కావాల్సిన వారు ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ ప్రారంభించే నాటికి ఉన్న ఖాళీలు, 8 ఏళ్ల సర్వీసు నిండిన ఖాళీల  వివరాల క్రమబద్ధీకరణతో వచ్చిన ఖాళీల జాబితాను వెబ్‌సైట్‌లో విద్యాశాఖ పొందుపరచనుంది. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువు ఉంటుంది.



ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇలా..

ఉపాధ్యాయులు తొలుత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత ఎంఈవోకు, ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి. అవసరమైన ధ్రువీకరణపత్రాలు అందజేయాలి. ఎంఈవో, హెచ్‌ఎంలు దరఖాస్తును, సర్టిఫికెట్లను పరిశీలించి వాటిని ధ్రుువీకరిస్తూ డీఈవోకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీటిని డీఈవో పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయునికి ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లను కేటాయిస్తారు. దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం ఒక రోజులో పాయింట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. దీని ఆధారంగా ప్రాధాన్య క్రమాన్ని సూచిస్తూ జాబితా తయారుచేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీనిపై అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు రెండు మూడు రోజుల సమయం కేటాయిస్తారు. అభ్యంతరాల పరిశీలన తరువాత తొలి జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తుదారులు తుది ప్రాధాన్యతను పరిశీలించి తమకు క్యాడర్‌లో ఎవరు దరఖాస్తు చేశారో.. ఏఏ పాఠశాలలకు అవకాశం ఉంటుందో చూసుకుని ధ్రువీకరించాలి. ఒకసారి ధ్రువీకరణ చేస్తే ఆ ఉపాధ్యాయుని స్థానం కూడా ఖాళీల జాబితాలోకి వెళ్తుంది. అయితే ఉన్న స్థానం పోతుందనే ఆందోళన చెందాల్సినవసరం లేదు. ధ్రువీకరణ చేయగానే ఉపాధ్యాయుడి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా పాస్‌వర్డ్ వస్తుంది. దీంతో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే క్యాడర్‌కు సంబంధించిన ఖాళీలు చూపుతుంది.



ఖాళీల ప్రాధాన్య క్రమంలో ఉపాధ్యాయులు ఎంపికచేసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఖాళీల జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక క్యాడర్‌లో 500 ఖాళీలుంటే అన్నింటికీ ఆప్షన్లు ఇవ్వాలి. రెండు నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాని ఉపాధ్యాయులు తమకు అవసరమైన పాఠశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి 199 ఆప్షన్లను కల్పిస్తారు. ఉపాధ్యాయులు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా చివరి ఆప్షన్‌గా తాను పనిచేస్తున్న పాఠశాలను విధిగా చేర్చాలి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఆన్‌లైన్ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. బదిలీ అయిన ప్రాంత సమాచారం మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top