
కోస్తా జిల్లా ప్రజలకు ఏపీకి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి: కోస్తా జిల్లా ప్రజలకు ఏపీకి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్) వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. రేపు(సోమవారం) సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశముందని పేర్కొంది. గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, ప్రజలు కూడా సముద్ర తీరం వైపు వెళ్లకుండా ఉండాలని పలు సూచనలు చేసింది.