breaking news
coastal Andhra districts
-
కోస్తా జిల్లా ప్రజలకు హెచ్చరిక
అమరావతి: కోస్తా జిల్లా ప్రజలకు ఏపీకి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. రేపు(సోమవారం) సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశముందని పేర్కొంది. గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, ప్రజలు కూడా సముద్ర తీరం వైపు వెళ్లకుండా ఉండాలని పలు సూచనలు చేసింది. -
కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
-
కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. విపరీతమైన వడగాలులు, ఉక్కపోతతో తూర్పు గోదావరి జిల్లాలో 13మంది, విశాఖలో 8మంది మృతి చెందారు. వడగాల్పులు, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విశాఖ జిల్లాలో పాఠశాలను ఒక్కపూటే నడపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో శుక్రవారం, శనివారం పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సెలవు ప్రకటించారు.