చౌక డిపోల వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపుకొడుతోందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకొల్లు అర్బన్ : చౌక డిపోల వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపుకొడుతోందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చౌకడిపోల ద్వారా 9 రకాల నిత్యావసర సరుకులను అందించారని గుర్తు చేశారు.
మొన్నటివరకు బియ్యం, కిరోసిన్, పంచదార మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ నెల నుంచి కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. త్వరలో బియ్యం కూడా ఎత్తివేసి చౌకడిపోలను మూసేసే ప్రయత్నంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చౌక డిపోలను మూసేసే ప్రయత్నం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.