టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి | We will not tolerate TDP attacks on YSRCP cadre, says Amabti Rambabu | Sakshi
Sakshi News home page

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి

May 29 2014 3:57 PM | Updated on Jun 4 2019 6:25 PM

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి - Sakshi

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి

వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

నెల్లూరు: వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులను సహించబోమని అంబటి హెచ్చరించారు. 
 
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల సమావేశంలో అంబటి పాల్గొన్నారు. సమావేశమనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైఎస్సార్పీపీ కార్యకర్తలపై ప్రతీకార దాడులు చేస్తోంది అని అన్నారు. 
 
టీడీపీ దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ దాడులను ఖండించి.. బాధితుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాలవారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement