ఆధిపత్య వాదాన్ని వదలాలి: కోదండరాం | We Oppose Seemandhra Dominant argument: Kodandaram | Sakshi
Sakshi News home page

ఆధిపత్య వాదాన్ని వదలాలి: కోదండరాం

Oct 2 2013 4:25 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఆధిపత్య వాదాన్ని వదలాలి: కోదండరాం - Sakshi

ఆధిపత్య వాదాన్ని వదలాలి: కోదండరాం

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని బాపుఘాట్‌ వద్ద తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు.

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని బాపుఘాట్‌ వద్ద తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఉద్యోగ సంఘ నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తదితరులు పాల్గొన్నారు. బాపుఘాట్‌ వద్ద నివాళులర్పించిన నేతలు ఆ తర్వాత మౌనదీక్షలో పాల్గొన్నారు. సీమాంధ్ర ఆధిపత్యాన్నే తామంతా వ్యతిరేకిస్తున్నామని కోదండరాం అన్నారు. ఆధిపత్య వాదాన్ని వదిలి తెలంగాణ ఆకాంక్షను గుర్తించాలని ఆయన కోరారు.

హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరే ప్రతిపాదననూ అంగీకరించేది లేదని కోదండరాం అంతకుముందు అన్నారు. హైదరాబాద్‌పై పేచీ పెట్టాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకోవడానికి, హైదరాబాద్‌ను వివాదాస్పదం చేయడానికి ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలను తిప్పికొడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement