మా దురదృష్టం..మా కేంద్ర మంత్రులే:అశోక్ బాబు | we never convince on united state, says ashok babu | Sakshi
Sakshi News home page

మా దురదృష్టం..మా కేంద్ర మంత్రులే:అశోక్ బాబు

Nov 11 2013 5:31 PM | Updated on Sep 2 2017 12:31 AM

మా దురదృష్టం..మా కేంద్ర మంత్రులే:అశోక్ బాబు

మా దురదృష్టం..మా కేంద్ర మంత్రులే:అశోక్ బాబు

'మా దురదృష్టం.. మా కేంద్ర మంత్రులు, మా మంత్రులు చేతకాని వాళ్లు' అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించారు.

ఢిల్లీ: 'మా దురదృష్టం.. మా కేంద్ర మంత్రులు, మా మంత్రులు చేతకాని వాళ్లు' అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంపై మరోమారు మీడియా ముందుకొచ్చిన అశోక్ బాబు సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఖరిపై మండిపడ్డారు. యూటీ, ప్యాకేజీలంటూ వారు మాట్లాడటం వారి అమాయకత్వమన్నారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కన్వీన్స్ అయ్యారేమో కానీ తాము మాత్రం కాదని అశోక్ బాబు తెలిపారు.

 

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో  కేంద్రమంత్రులు సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేసిన నేపథ్యంలో అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు, యూటీ ప్రాంతాలంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం తగదని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement