'జగన్ దీక్షకు మద్దతుగా పోరాటం ఉధృతం' | We fight more effort on united andhrapradesh due to ys jagan deeksha, says anantapur district ysrcp leaders | Sakshi
Sakshi News home page

'జగన్ దీక్షకు మద్దతుగా పోరాటం ఉధృతం'

Aug 26 2013 1:01 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శంకర్ నారాయణ, విశ్వేశ్వరరెడ్డి, ఎర్రుస్వామిరెడ్డిలు సోమవారం ఇక్కడ తెలిపారు. ఈ నెల 27న రహదారులను  దిగ్బంధం చేస్తామన్నారు. అలాగే 28న నగరంలోని విద్యార్థులతో అతిపెద్ద ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

 

అలాగే 29న ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు. 30వ తేదీన జైలోభరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. అయితే అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలు రోజురోజూకు ఉధృతం అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. విద్యాసంస్థలకు యాజమాన్యం స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement