'టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు' | we are not afraid with TDP leaders activities, says YSRCP | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు'

Jun 25 2015 12:17 PM | Updated on Aug 10 2018 9:42 PM

'టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు' - Sakshi

'టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు'

టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీదర్రెడ్డిలు అన్నారు.

నెల్లూరు: టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీదర్రెడ్డిలు అన్నారు. పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల అవినీతిని బట్టబయలు చేసినందుకే తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించాలరని వారు ఆరోపించారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో స్టీఫెన్ తో సంభాషించిన ఆడియో టేపులు లభ్యమై, ప్రస్తుతం ఓటుకు కోట్లు కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement