రాష్ట్ర విభజన వల్ల నీటి కేటాయింపులో ఎలాంటి సమస్యా రాదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర విభజన వల్ల నీటి కేటాయింపులో ఎలాంటి సమస్యా రాదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్పారు. విభజన వల్ల నీటి యుద్ధాలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సుదీర్ఘ విలేకరుల సమావేశంలో కుండ బద్దలుకొట్టి మరీ చెప్పిన విషయాలను రాష్ట్ర మంత్రి మంగళవారం ఖండించారు.
విభజన ప్రక్రియ మొదలుకాగానే అందులో భాగంగా కమిటీలు ఏర్పాటు చేస్తారని, తద్వారా జలాల పంపిణీ కూడా సక్రమంగానే సాగుతుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి ఏం చెప్పాడో తనకు తెలియదు గానీ.. తాను చెప్పేది మాత్రం నిజమని ఆయన వెల్లడించారు.