శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద | Water Levels In Srisailam And Jurala Projects | Sakshi
Sakshi News home page

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

Aug 15 2019 4:45 PM | Updated on Aug 15 2019 6:03 PM

Water Levels In Srisailam And Jurala Projects  - Sakshi

సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 7,19,725 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా శ్రీశైలం డ్యామ్‌కు మొత్తం 7,73,917 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 10 గేట్ల ద్వారా 8,60,012 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీల నీరు ఉంది.

జూరాల : రికార్డు స్థాయిలో జూరాల నుంచి శ్రీశైలానికి ఇప్పటికే  555.641 టీఎంసీలు నీరు చేరింది. ప్రాజెక్టు నీటి వివరాలు..

ఇన్ ఫ్లో : 7,20,000 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 7,19,725 క్యూసెక్కులు

ప్రస్తుత నీటి నిల్వ : 5.943 టీఎంసీలు

పూర్తిస్థాయి  నీటి నిల్వ : 9.657 టీఎంసీలు

ప్రస్తుతం నీటి నిల్వ మట్టం :     316.500 మీటర్లు

పూర్తిస్థాయి నీట్టి మట్టం: 318.516 మీటర్లు
 

Advertisement
 
Advertisement
Advertisement