ఏసీబీ వలలో రావులాపురం వీఆర్వో | VRO Caught While Demanding Bribery in Guntur Ravulapuram | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో రావులాపురం వీఆర్వో

Dec 29 2018 1:26 PM | Updated on Dec 29 2018 1:26 PM

VRO Caught While Demanding Bribery in Guntur Ravulapuram - Sakshi

ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు (ఇన్‌సెట్‌) వీఆర్వో రాజు

ఏసీబీ వలలో మరో అవినీతి చేప పడింది. బొల్లాపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రూ.20 వేలు  లంచం తీసుకుంటున్న రావులాపురం వీఆర్వో రాజును ఏసీబీ అధికారులు శుక్రవారం దాడిచేసి పట్టుకున్నారు. వ్యవసాయ భూమికి పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్‌ చేసి ముందస్తుగా రూ.20 వేలు తీసుకుంటుండగా అరెస్టు చేశారు.

బొల్లాపల్లి: పొలం పాసు పుస్తకం మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడిన ఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం  చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు ఏసీబీ అడిషనల్‌ ఎస్సీ ఎ.సురేష్‌ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం మండలంలోని రావులాపురం గ్రామానికి చెందిన మారంరెడ్డి వెంకటరెడ్డి భార్య సరోజిని పేరుమీద 1.80 ఎకరా భూమికి పాసు పుస్తకాలు (టైటిల్‌ డీడ్, మ్యూటేషన్‌) కోసం లంచం రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు.

ఈ విషయం  వెంకటరెడ్డి తన సోదరుడైన ఆదిరెడ్డికి పురమాయించాడు. తొలుత రూ.20 వేలు చెల్లిస్తే పనిచేసి పెడతామని వీఆర్వో బదులివ్వడంతో, ఆదిరెడ్డి ఈ నెల 26న ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనమేరకు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆదిరెడ్డి రూ.20 వేలు లంచాన్ని రావులాపురం వీఆర్‌ఏ కడియం రాజుకు ఇస్తుండగా దాడులు చేసినట్టు తెలిపారు. నగదు స్వాధీనం చేసుకుని, వీఆర్వోను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అడిషనల్‌ ఎస్సీ ఎ.సురేష్‌బాబు తెలిపారు.

రూ.32 వేలు డిమాండ్‌ చేశారు
బాధితుడు మారం రెడ్డి వెంకటరెడ్డి విలేకర్లు వద్ద తెలిపిన  వివరాలు ప్రకారం మా స్వగ్రామమైన రావులాపురంలో నెల క్రితం 1.80 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. పాసుపుస్తకాల కోసం గత నెల 27న దరఖాస్తు చేశా. పాసుపుస్తకాల మంజూరుకు వీఆర్వో కడియం రాజు రూ.32 వేలు డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement