ముఖ్యమంత్రి నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు

VOAs Praised CM Jagan on Salary Increase - Sakshi

కృష్ణాజిల్లా :ఇచ్చిన మాట ప్రకారం జీతాలను 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకోవటంతో మెప్మా,ఆర్పిలలో ఆనందం వ్యక్తమవుతోంది. మంగళవారం జగ్గయ్యపేటలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, నాయకులు తన్నీరు నాగేశ్వరావు, ముత్యాల వెంకటాచలం, చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్లు పాల్గొన్నారు. కానూరులో వీఓఏలు ముఖ్యమంత్రి జగన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొఠారి శ్రీను, మాజీ ఎంపీటీసీ ఛాన్ బాషాలు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి యానిమేటర్లకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద  దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి  సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీ కి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప.గో.జిల్లా :పాలకొల్లు పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా ఆర్.పిలకు10వేలు జీతాలు పెంచినందుకునియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందనీ, మా కష్టాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ప్రశంసించారు.

వైఎస్సార్ జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ  కడప నగరంలో విఓఏలు ర్యాలీ నిర్వహించారు. జీవితాంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. రాయచోటిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.

విశాఖ: నర్సిపట్నంలోని కేడీ పేటలో గ్రామ సంఘాలు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిటికెల భాస్కర నాయుడు పాల్గొన్నారు. 

నెల్లూరు జిల్లా : నాయుడుపేట పట్టణంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. 

ప్రకాశం : జీతాలు పెంపుపై డీఆర్‌డీఏ , మెప్మా ఉద్యోగులు సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్లను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. తెలిపిన డిఆర్ డిఏ ,మెప్మా ఉద్యోగులు, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top