
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. స్వామివారిని వీఐపీలు దర్శించుకుంటున్నారు. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు వచ్చిన భక్తులకు రాన్ డమ్ గా కోవిడ్ టెస్టులు నిర్వహించడానికి స్విమ్స్ లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేశారు. నేడు మూడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ట్రయల్ రన్ లో నిన్న శ్రీవారిని 7200 మంది స్థానికులు దర్శించుకున్నారు.