విమానాల హబ్‌గా విశాఖ | Visakhapatnam as Airline Hub | Sakshi
Sakshi News home page

విమానాల హబ్‌గా విశాఖ

Nov 12 2014 1:42 AM | Updated on May 3 2018 3:17 PM

విమానాల హబ్‌గా విశాఖ - Sakshi

విమానాల హబ్‌గా విశాఖ

దేశ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రవాణా వ్యవస్థ పటిష్టత చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం
 
సాక్షి, విశాఖపట్నం : దేశ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రవాణా వ్యవస్థ పటిష్టత చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో వరుస ఒప్పందాలు చేసుకుంటోంది. వీటిలో ఒకటి ఇప్పటికే అమలులోకి రాగా త్వరలో మరో ఒప్పందం ఆచరణలోకి రానుందని సీఎం చంద్రబాబు ప్రకటనతో విశాఖలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధిపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.

విశాఖ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం కొన్ని నగరాలకే విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్‌కోస్టా, సిల్క్ ఎయిర్‌వేస్ సంస్థలు హెదరాబాద్, బెంగుళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై, చెన్నై, దుబాద్, కోల్‌కత్తా, సింగపూర్‌లకు  16 సర్వీసులు నడుపుతున్నారు. హుదూద్ తుపాను తర్వాత సిల్క్ ఎయిర్‌వేస్ సర్వీసులు నిలిచిపోయాయి. విశాఖ నుంచి ప్రతి రోజూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.

ఈ మేరకు ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)పై సేల్స్ టాక్స్ తగ్గించేందుకు అంగీకరించింది. భవిష్యత్‌లో అగర్తల, అహ్మదాబాద్, బాగ్దోగ్రా, బ్యాంకాక్, బెంగుళూరు, భువనేశ్వర్, చంఢీఘర్, కొయంబత్తూర్, చెన్నై, ఢిల్లీ, డిడ్రుఘర్, గోవా, దుబాయ్, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, జమ్ము, ఖాట్మండ్, కొచ్చి, కోల్‌కత్తా, లక్నో, ముంబై, మస్కట్, నాగ్‌పూర్, పాట్నా, పూణె, రాయ్‌పూర్, రాంచీ, సింగపూర్, శ్రీనగర్, త్రివేండ్రం, వడోదర, వారణాసి తదితర 35 నగరాలకు విశాఖ నుంచి ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం 100 విమానాలతో విశాఖను హబ్‌గా మార్చనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement