ఉత్సవ్ కలెక్షన్ | Visakha Utsav, a major target | Sakshi
Sakshi News home page

ఉత్సవ్ కలెక్షన్

Jan 11 2015 12:57 AM | Updated on Sep 2 2017 7:30 PM

ఉత్సవ్ కలెక్షన్

ఉత్సవ్ కలెక్షన్

సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టుంది విశాఖ ఉత్సవ్ నిర్వహణ తీరు.

విశాఖఉత్సవ్ కోసం భారీగా టార్గెట్లు
నలిగిపోతున్న పారిశ్రామిక సంస్థలు.. దాతలు
{పజాప్రతినిధుల మెప్పుకోసంఅధికారుల వెంపర్లాట
నిర్వహణ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

 
విశాఖపట్నం: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టుంది విశాఖ ఉత్సవ్ నిర్వహణ తీరు.  ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చిన పాపానపోలేదు. భారమంతా ప్రయివేట్ సంస్థలపై మోపుతున్నారు. దీంతో ఈ పేరు వింటేనే ప్రయివేటు సంస్థలు.. పరిశ్రమల యజమానులు భయపడుతున్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.5కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. వుడా రూ.50 లక్షలు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఏపీ టూరిజంతో సహా అనుబంధ శాఖల న్నీ దాదాపు చేతులెత్తాశాయి. దీంతో ‘ప్రయివేటు’ గా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ‘మంత్రి గారు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని త లపెట్టారు. ఆయనకు మాట రాకూడదు.. నిర్వహణలో ఎక్కడా ఫెయిల్ కాకూడదంటూ ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉదయం కలెక్టరేట్‌లో..మధ్యాహ్నం వుడాలో.. సాయంత్రం సర్క్యూట్ హౌస్‌లో అన్నట్టుగా సాగుతున్న ఈ సమీక్షల సారాంశం ఒక్కటే. ఎవరెవరు ఎంత ఇస్తామన్నారు? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? మిగిలిన మొత్తం ఎప్పటిలోగా ఇవ్వను న్నారు? చెప్పండంటూ  రహస్య(ఇన్‌కెమెరా)సమావేశాల్లో టార్గెట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలుపట్టుకుంటున్నారు.

హుద్‌హుద్ తుఫాన్ వల్ల అన్ని వర్గాలతోపాటు పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లింది. ఈనష్టాన్ని పూడ్చేచర్యలు చేపట్టడంలో అటు కేంద్రం..ఇటు రాష్ర్టం ఇప్పటివరకూ రూపాయి విదిల్చింది లేదు. పుట్టెడు నష్టాల్లో ఉన్న ఈసంస్థలకు ఇప్పుడు ఉత్సవాల పేరిట ఇండెంట్లు పెడుతున్నారు. ఇస్తారా?..చస్తారా?అన్నట్టుగా మెడపై కత్తిపెడుతున్నారు. ఒక కమి టీ వచ్చి ఇండెంట్ పెట్టిన కొద్ది గం టలకే మరొక కమిటీ వచ్చి మరో ఇం డెంట్ పెడుతుందని ఓ సంస్థ యజ మాని ఆవేదన చెందారు.  మా వల్ల కాదని  సంస్థలు చెబుతుంటే కన్నెర్ర చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కొక్క సంస్థకు ఐదు లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఇండెంట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో దా తలు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక కార్యక్రమం పేరుతో విరాళా లు ఇవ్వాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని ఓ ప్రముఖసంస్థ సీఈఒ సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement