breaking news
the industrial sector
-
ఉత్సవ్ కలెక్షన్
విశాఖఉత్సవ్ కోసం భారీగా టార్గెట్లు నలిగిపోతున్న పారిశ్రామిక సంస్థలు.. దాతలు {పజాప్రతినిధుల మెప్పుకోసంఅధికారుల వెంపర్లాట నిర్వహణ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు విశాఖపట్నం: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టుంది విశాఖ ఉత్సవ్ నిర్వహణ తీరు. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చిన పాపానపోలేదు. భారమంతా ప్రయివేట్ సంస్థలపై మోపుతున్నారు. దీంతో ఈ పేరు వింటేనే ప్రయివేటు సంస్థలు.. పరిశ్రమల యజమానులు భయపడుతున్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.5కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. వుడా రూ.50 లక్షలు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఏపీ టూరిజంతో సహా అనుబంధ శాఖల న్నీ దాదాపు చేతులెత్తాశాయి. దీంతో ‘ప్రయివేటు’ గా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ‘మంత్రి గారు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని త లపెట్టారు. ఆయనకు మాట రాకూడదు.. నిర్వహణలో ఎక్కడా ఫెయిల్ కాకూడదంటూ ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉదయం కలెక్టరేట్లో..మధ్యాహ్నం వుడాలో.. సాయంత్రం సర్క్యూట్ హౌస్‌లో అన్నట్టుగా సాగుతున్న ఈ సమీక్షల సారాంశం ఒక్కటే. ఎవరెవరు ఎంత ఇస్తామన్నారు? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? మిగిలిన మొత్తం ఎప్పటిలోగా ఇవ్వను న్నారు? చెప్పండంటూ రహస్య(ఇన్‌కెమెరా)సమావేశాల్లో టార్గెట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల అన్ని వర్గాలతోపాటు పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లింది. ఈనష్టాన్ని పూడ్చేచర్యలు చేపట్టడంలో అటు కేంద్రం..ఇటు రాష్ర్టం ఇప్పటివరకూ రూపాయి విదిల్చింది లేదు. పుట్టెడు నష్టాల్లో ఉన్న ఈసంస్థలకు ఇప్పుడు ఉత్సవాల పేరిట ఇండెంట్లు పెడుతున్నారు. ఇస్తారా?..చస్తారా?అన్నట్టుగా మెడపై కత్తిపెడుతున్నారు. ఒక కమి టీ వచ్చి ఇండెంట్ పెట్టిన కొద్ది గం టలకే మరొక కమిటీ వచ్చి మరో ఇం డెంట్ పెడుతుందని ఓ సంస్థ యజ మాని ఆవేదన చెందారు. మా వల్ల కాదని సంస్థలు చెబుతుంటే కన్నెర్ర చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కొక్క సంస్థకు ఐదు లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఇండెంట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో దా తలు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక కార్యక్రమం పేరుతో విరాళా లు ఇవ్వాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని ఓ ప్రముఖసంస్థ సీఈఒ సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
పరిశ్రమలపై మరో పిడుగు!
నేటి నుంచి వారానికి రెండు రోజులు పవర్ హాలీడే సిటీబ్యూరో: అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పారిశ్రామిక రంగంపై తాజాగా మరో పిడుగు పడింది. ప్రస్తుతం వారానికి ఒక్క రోజు పవర్ హాలీడే ఉండగా.. దాన్ని రెండు రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోతలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ కంపెనీ ప్రకటించింది. రంగారెడ్డి నార్త్, రంగారెడ్డి ఈస్ట్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ సర్కిళ్ల పరిధిలో ఆది, సోమవారాల్లో పవర్ హాలీడే ఉండగా.. రంగారెడ్డి సౌత్‌లో శుక్ర, శనివారాల్లో ఈ కోతలు అమలులో ఉంటాయి. గృహాలకు నిత్యం ఉదయం 2, మధ్యాహ్నం 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు యధావిధిగా కొనసాగుతాయి. విద్యుత్ సరఫరా, డిమాండ్‌కు మధ్య పెరిగిన వ్యత్యాసం వల్లే కోతల వేళలు పెంచాల్సి వచ్చిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తాజా విద్యుత్ కోతలపై పారిశ్రమిక వర్గాలు, గృహ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. కోతల పెంపుతో పరిశ్రమల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. -
పరిశ్రమలకు ప‘వర్రీ’
విద్యుత్ సమ్మెతో పరిశ్రమలు విలవిల ఫార్మా, ఐటీ, సెజ్‌లకు దెబ్బ పారిశ్రామిక రంగానికి తొలిరోజు నష్టం రూ.97 కోట్లు పైమాటే పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. ఐటీ కంపెనీలు తాత్కాలిక సెలవు ప్రకటించాయి. నీటి సరఫరా లేక ఫార్మా కంపెనీలు మూతపడుతున్నాయి. దువ్వాడ ఎస్ఈజెడ్లోని సుమారు 32 కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. స్టీల్‌ప్లాంట్‌లోనూ ఇదే పరిస్థితి. విద్యుత్ ఉద్యోగుల సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరడంతో ఈ దుస్థితి నెలకొంది. దీని వల్ల పరిశ్రమలకు భారీగానే నష్టం వాటిల్లింది. సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సమ్మె రెండో రోజుకు చేరడంతో జిల్లా పారిశ్రామిక రంగం కావికలమవుతోంది. అత్యంత కీలకమైన ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సెజ్‌లకు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడా సరఫరాలేకపో వడంతో కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఆదివారం నుంచే విద్యుత్ సమ్మె ప్రారంభమైనప్పటికి సెలవురోజు కావడంతో కంపెనీలకు పెద్దగా ఇబ్బందిలేకపోయింది. కానీ సోమవారం ఉదయం నుంచే విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో అనేక రంగాలు విలవిలలాడి పోయాయి. ఒకపక్క సరఫరా నిలిచిపోగా, మరోపక్క సొంత విద్యుత్‌తో నిరంతరాయంగా ఉత్పత్తి చేపట్టలేక అనేక సంస్థలు తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపివేశాయి. అంతా కుదేలు 24గంటలు విద్యుత్ అవసరమైన ఐటీ రంగానికి సోమవారం ఉదయం నుంచే సరఫరా నిలిచిపోయింది. దీనిప్రభావం నగరంలోని 70 ఐటీ కంపెనీలపై పడింది. రుషికొండ హిల్‌తోపాటు మొత్తం నాలుగు ఎస్ఈజెడ్లకు సరఫరా లేదు. దీంతో కొంతసేపు ప్రత్యామ్నాయ విద్యుత్‌పై కంపెనీలు నడిపించారు. కానీ సరఫరా రాకపోవడంతో ఉద్యోగులకు తాత్కాలిక సెలవులు ప్రకటించారు. నగరం నడిబొడ్డున ఉన్న హెచ్ఎస్బీసీ, మహీంద్రా సత్యం, విప్రో తదితర ఐటీ కంపెనీలు కూడా ఇదే సమస్యతో సతమతమయ్యాయి. ఫార్మా రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పరవాడలోని ఫార్మా ఎస్ఈజెడ్లో మొత్తం 54 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి ఉదయం నుంచే విద్యుత్ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనంతో ప్లాంట్లను నడిపించాయి. నిరంతరంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌తో కంపెనీలను నడపడం కష్టం కావడంతో సెజ్‌లో దాదాపు కంపెనీలన్నీ ఉత్పత్తిలో కోత విధించాయి. ఫార్మా ఎస్ఈజెడ్కు ఏలేరు కాలువ నుంచి నిత్యం నీటి సరఫరా అవుతుండగా విద్యుత్ లేక సోమవారం సరఫరా ఆగిపోయింది. దీంతో కంపెనీలు నిర్వహణపరమైన పనులకు నీరు లేక నిలిచిపోయాయి. దువ్వాడ ఎస్ఈజెడ్లో సుమారుగా 32 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో ఐటీ, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలు అనేకం విదేశీ ఎగుమతులకు సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్నాయి. వీటికూడా సరఫరా నిలిచిపోయింది. ఉదయం 11.30 గంటల వరకు సరఫరా ఆగిపోగా, ఆ తర్వాత కొంతసేపు వచ్చింది. తిరిగి మూడు గంటల నుంచి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పెద్ద కంపెనీలు సొంతంగా ఉత్పత్తి నడిపిస్తుంటే, మధ్యతరహా కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయి. దీంతో వేలాది కార్మికులకు పనిలేకుండా పోయింది. చిన్న, మధ్యతరహా కంపెనీలు జిల్లాలో 1200కుపైగా ఉన్నాయి. వీటిలో ఏపీఐఐసీ ఐలాలో 900 కంపెనీలున్నాయి. గాజువాక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 50 కంపెనీలున్నాయి. వీటికి ఉదయం నుంచి విద్యుత్ లేదు. సగానికిపైగా పరిశ్రమలకు సొంత విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ఇవన్నీ మూతపడ్డాయి. దీంతో కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితీ అంతే. వీటికికూడా ఉదయం నుంచి విద్యుత్ లేదు. దీంతో ఒక్క కలెక్టరేట్‌కు మినహా మిగిలిన వాటికి సొంత విద్యుత్ వనరు లేకపోవడంతో కార్యాలయాలన్నీ చీకటిమయమైపోయాయి. జిల్లా అధికారులు చీకట్లోనే విధులు నిర్వహించగా, మరికొందరు చేసేదిలేక ఇళ్లకు వెళ్లిపోయారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, హెచ్పీసీఎల్కూ సమస్యలు తప్పలేదు. వీటికి భారీస్థాయిలో సొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నప్పటికీ విద్యుత్ సమ్మె కారణంగా సరఫరా లేకపోవడంతో సోమవారం అంతా ప్రత్యామ్నాయ విద్యుత్‌పైనే ఆధారపడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తం మీద జిల్లాలో తొలిరోజు ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్, భారీ కంపెనీలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో విద్యుత్ సరఫరా లేక ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు రూ.98 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు పారిశ్రామిక వర్గాలు అంచనా వేశాయి. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే నష్టం తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పవర్ హాలిడే సమస్య ఇంకా కొనసాగుతుండడం, మరోపక్క సమ్మె వల్ల నష్టం పెరగడంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రైల్వే రంగంపై విద్యుత్ సమ్మె ప్రభావం ఏమాత్రం లేకున్నా ముందస్తు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం కోటా నుంచి నిరంతరం సరఫరా జరుగుతున్నా ఒకవేళ గ్రిడ్ దెబ్బతింటే ఒడిశా నుంచి తమకు విద్యుత్ నిరంతరంగా అందుబాటులో ఉండే లా ఒడిశాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.