బాలికల హాస్టల్‌లో దుర్భర పరిస్థితులు!

Vigilance Officers Visit Girls Hostel In West Godavari - Sakshi

విజిలెన్స్‌ తనిఖీలు షాకింగ్‌ విషయాలు

బాలికల ఆరోగ్యాలతో వార్డెన్‌ ఆటలు

సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం బాలికల వసతి గృహంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. బాలికల వసతి గృహంలో భారీగా అవకతకవలు జరిగినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా దుర్భరమైన పరిస్థితుల్లో నడుమ హాస్టల్‌లో బాలికలు గడుపుతున్నారని, హాస్టల్‌లోని బాత్రూమ్‌లు, కిచెన్‌తోపాటు పరిసర ప్రాంతాలు ఏమాత్రం శ్రుభంగా లేవని తెలిపారు. వసతి గృహంలో భారీగా బియ్యపు నిలువలు ఉన్నాయని, 865 కేజీలకుగాను 2500 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉండాల్సిన పరిమాణంలో వంట సరుకులు లేవని,  మెనూలో ఉన్న ఆహార పదార్ధాలు ఎందుకు పిల్లలకు పెట్టడం లేదని హాస్టల్‌ వార్డెన్‌ను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో వార్డెన్‌ ఆటలాడుతున్నారని అధికారులు మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top