తిరుచానూరులో ప్రసాదాల కుంభకోణం | vigilance enquiry on tiruchanoor Gave scandal | Sakshi
Sakshi News home page

తిరుచానూరులో ప్రసాదాల కుంభకోణం

Dec 8 2015 11:38 AM | Updated on Sep 3 2017 1:42 PM

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల కుంభకోణం కలకలం రేపింది.

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల కుంభకోణం కలకలం రేపింది. దీనిపై విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అయితే అధికారుల ఒత్తిడి కారణంగా రహస్య విచారణ కొనసాగిస్తుందని తెలుస్తుంది. బ్రహోత్సవాల్లో తయారు చేసిన జిలేబీ ప్రసాదాన్ని పెద్ద ఎత్తున ఆలయ ఉద్యోగి పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో ఆలయ సూపరింటెండెంట్తో పాటు ఓ  ఇన్స్పెక్టర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యోగుల పేరుతో ప్రసాదాన్ని విక్రయిస్తున్న దళారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ప్రసాదాల కుంభకోణంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement