శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల కృష్ణ | Minister Venugopala Krishna visits Shri Padmavati Ammavari Temple | Sakshi
Sakshi News home page

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల కృష్ణ

Apr 20 2023 9:58 PM | Updated on Apr 20 2023 10:17 PM

Minister Venugopala Krishna visits Shri Padmavati Ammavari Temple - Sakshi

తిరుపతి: తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి  చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ స్వాగతం పలికారు.

మంత్రి  ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకుని, ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా డిప్యూటీ ఈవో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement