పత్రికలు సంచలనాలకు దూరంగా ఉండాలి | Venkiah's suggestion in the event of Andhra newspaper relaunch | Sakshi
Sakshi News home page

పత్రికలు సంచలనాలకు దూరంగా ఉండాలి

Jul 30 2017 1:35 AM | Updated on Sep 5 2017 5:10 PM

పత్రికలు సత్యాలకు దగ్గరగా.. సంచలనాలకు దూరంగా ఉండాలని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు సూచించారు.

ఆంధ్రపత్రిక పునఃప్రారంభ కార్యక్రమంలో వెంకయ్య సూచన
 
సాక్షి, విజయవాడ: పత్రికలు సత్యాలకు దగ్గరగా.. సంచలనాలకు దూరంగా ఉండాలని  ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడ ఐవీప్యాలెస్‌లో ఆంధ్రపత్రిక దినపత్రిక కృష్ణా జిల్లా ఎడిషన్‌ను ఆయన శనివారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పత్రికలు స్వేచ్ఛ, హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలన్నారు.

జాతీయ ఉద్యమంలో అర్ధ శతాబ్దం పాటు ప్రజలను జాగృతం చేసిన ఆంధ్రపత్రిక 1991లో అనివార్య కారణాల వల్ల మూతపడిందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆంధ్రపత్రికకు దక్కుతుందన్నారు. కాగా విజయవాడలోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యాలయాన్ని శనివారం వెంకయ్యనాయుడు సందర్శించి అక్కడి వారితో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement