వైబీ హళ్లి చెరువు ఖాళీ | Vaibi halli tank empty | Sakshi
Sakshi News home page

వైబీ హళ్లి చెరువు ఖాళీ

Oct 29 2014 1:45 AM | Updated on Sep 17 2018 8:02 PM

వైబీ హళ్లి చెరువు ఖాళీ - Sakshi

వైబీ హళ్లి చెరువు ఖాళీ

మడకశిర రూరల్ : మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లిన వైబీహళ్లి చెరువు మంగళవారం తెల్లవారుజాముకు పూర్తిగా ఖాళీ అయిపోయింది.

గండితో భారీ నష్టం
 
 మడకశిర రూరల్ :
 మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లిన వైబీహళ్లి చెరువు మంగళవారం తెల్లవారుజాముకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. చెరువుకు పడిన గండిని సకాలంలో పూడ్చి వేయకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు గ్రామీణులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత చెరువు పొంగి పొర్లిందని, అయితే గండిపడడంతో ఒక్క రాత్రిలోనే నీరంతా హరేసముద్రం చెరువుకు వెళ్లిపోయిందని రైతులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు.

 చేతులు కాలాక : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది అధికారుల పనితీరు. వైబీ హళ్లి చెరువుకు పడ్డ గండిని ఆర్డీఓ వెంకటే శు, ఇరిగేషన్ అధికారులు మంగళవారం ఉ దయం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుకు పడ్డగండిని పూడ్చడానికి అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ శాఖ ఎఈ, డీఈలు అక్కడే ఉంటూ జేసీబీల ద్వారా పనులు చేపట్టారు. చెరువులో నీరంతా వెళ్లిపోయిన తర్వాత అధికారులు చేపట్టిన చర్యలు పలు విమర్శలకు దారి తీశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement