'సీఎం తమ్ముడు టిక్కెట్లు అమ్ముకున్నాడు' | V Hanumantha Rao Slams kiran kumar reddy, his brother | Sakshi
Sakshi News home page

'సీఎం తమ్ముడు టిక్కెట్లు అమ్ముకున్నాడు'

Jan 13 2014 1:23 PM | Updated on Sep 19 2019 8:28 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం తమ్ముడు తిరుమలలో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు మరోసారి ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం తమ్ముడు తిరుమలలో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కిరణ్ సోదరుడు, అతని తనయుడికి ఏ హోదాలో వెంకన్న ప్రత్యేక దర్శనం కల్పించారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

దీనిపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తామని ఆయన తెలిపారు. పనిలో పనిగా వీహెచ్ ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై మండిపడ్డారు. తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేయటాన్ని ఆయన ఖండించారు. ఎవరు ఆపినా తెలంగాణ ఆగదని హనుమంతరావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement