సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై నిర్లక్ష్యం | Use of Funds Sub Plan negligence | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై నిర్లక్ష్యం

Jan 5 2014 5:51 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఎస్సీ, ఎస్టీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా విడుదల చేసిన సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని కపాడ్స్ డెరైక్టర్ ఎం.అమృత్ విమర్శించారు.

 ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ :
 ఎస్సీ, ఎస్టీ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా విడుదల చేసిన సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని కపాడ్స్ డెరైక్టర్ ఎం.అమృత్ విమర్శించారు. శనివా రం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీలు ఏర్పాటు చేసి నిధుల ఖర్చుపై ఉద్యమిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో, గూడేల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, ఇళ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండగా.. అధికారులు నిధులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. సబ్‌ప్లాన్ చట్టం చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలకే నిధులు దక్కే విధంగా ఉద్యమిస్తామని తెలిపారు. ఈ నెల ఆరున మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మండల కమిటీని ఎన్నుకుంటామని ప్ర కటించారు. పార్టీలు, సంస్థలకు అతీతంగా నా యకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఉట్నూర్ అధ్యక్షుడు కాటం రమేశ్, నాయకులు సింగరే భారత్, పేందోర్ జైవంత్‌రావు, ఆర్.శ్యామ్‌నాయక్, సోమోరే నాగోరావు, గంగన్న, కాంతరావు, ఉత్తమ్ పాల్గొన్నారు.
 
 ఆదిలాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
 ఎదులాపురం : సెంటర్ ఫర్ అకాడమీ ఎండ్ పీపుల్స్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ డెరైక్టర్ ఎం.అమృత్‌రావు, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్లామొద్దీన్ మాట్లాడారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పరిరక్షణ ఆదిలాబాద్ డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్‌గా  మోతె బారిక్‌రావు, కో కన్వీనర్లుగా ఉయిక సంజీవ్, గౌతం మునీశ్వర్, సభ్యులుగా మెస్రం రాజేశ్వర్, వసంత్‌పవార్, మర్సుకోల బాపురావు, రాథోడ్ సాగర్, మెస్రం జలేంధర్ ఎన్నికయ్యారు. అన్ని మండలాల్లో కమిటీని విస్తరించాలని తీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement