అర్బన్ బ్యాంక్‌లో లాకర్స్ ప్లాజా | Urban Bank Plaza lockers | Sakshi
Sakshi News home page

అర్బన్ బ్యాంక్‌లో లాకర్స్ ప్లాజా

Jan 20 2014 1:53 AM | Updated on Aug 24 2018 2:33 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రప్రథమంగా సురక్షిత, ధృడమైన లాకర్స్ ప్లాజాను నెలకొల్పుతున్నట్లు ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్

కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రప్రథమంగా సురక్షిత, ధృడమైన లాకర్స్ ప్లాజాను నెలకొల్పుతున్నట్లు ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో ఆదివారం  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఇష్టమైన ఆరు సైజుల్లో 4,000 లాకర్స్ తాయారు చేయిస్తున్నామన్నారు. మెరుగైన సేవలందించడానికి నూతన భవన నిర్మాణం చేపట్టి అందులో లాకర్స్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 
 
 లాకర్స్ సైజును బట్టి వార్షిక అద్దె రూ.1,350 నుంచి రూ.8,000 నిర్ణయించినట్లు చెప్పారు. ఖాతాదారులు ఆధార్ కార్డు, ఒక ఫొటో తీసుకొచ్చి లాకర్‌లను బుక్ చేసుకోవాలని కోరారు. అనంతరం లాకర్స్ ప్లాజా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వివరాలకు 0863-2230737, 8008499323 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ అడపా వెంకటరత్నం, పాలక వర్గ సభ్యులు జాగర్లమూడి శ్రీనివాసరావు, బసివిరెడ్డి, అడపా కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, జి.నారాయణమూర్తి, సీఈవో సీతారాములు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement