వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్య రాష్ర్టం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ అన్నారు.
చింతలపూడి, న్యూస్‌లైన్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్య రాష్ర్టం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్‌ను నిరసిస్తూ చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో శుక్రవారం రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. సోనియా, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను దహనం చేశారు. రాజేష్‌కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాక మార్షల్స్‌తో గెంటించి అనంతరం అరెస్టు చేయడం అమానుషమన్నారు. అరె స్ట్‌లకు భయపడేది లేదన్నారు.
సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.నవీన్‌బాబు, మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పట్టణ కన్వీనర్ గంధం చంటి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ ఎం.ఇమ్మానియేలు, నాయకులు ఎస్.కాంతారావు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, వేమారెడ్డి, దాసరి వెంకన్న, చెంచమరాజు, భాస్కర్, ఏడుకొండలు, తాతారావు, మైసన్న, పండు పాల్గొన్నారు