సీమాంధ్ర అంతటా సమైక్యవాదుల ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: సీమాంధ్ర అంతటా సమైక్యవాదుల ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం విశాఖ వాసులు చేపట్టిన నిరసనలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో సమైక్యవాదు సమ్మె కారణంగా 1060 ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఏయూలో వంటావార్పు చేపడుతున్నారు. మద్దెలపాలెం సెంటర్‌లో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా, తిరుమలకు 106 బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు.