నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగులు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు.
నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగులు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఖాళీలుగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.