ముక్కుతో చకచకా టైపింగ్! | Sakshi
Sakshi News home page

ముక్కుతో చకచకా టైపింగ్!

Published Wed, Sep 25 2013 4:25 AM

ముక్కుతో చకచకా టైపింగ్! - Sakshi

గిన్నిస్ కోసం నగరవాసి వినూత్న యత్నం
 హైదరాబాద్, న్యూస్‌లైన్: నగరంలోని పాతబస్తీ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఖుర్షీద్‌హుస్సేన్ గిన్నిస్ రికార్డు కోసం వినూత్న ప్రయత్నం చేశారు. కంప్యూటర్ కీబోర్డుపై ముక్కుతో ఏ నుంచి జెడ్ వరకూ 53 సెకన్లలోనే టైప్ చేశారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సాక్షుల మధ్య ఈ ప్రక్రియను రికార్డును చేశారు. ముక్కుతో అత్యధిక వేగంగా టైప్ చేసిన రికార్డు ప్రస్తుతం దుబాయికి చెందిన ఓ అమ్మాయి పేరు మీద ఉందని, అయితే ఆమె 1.33 నిమిషాల్లో టైప్ చేయగా.. తాను 53 సెకన్లలోనే పూర్తిచేసినందున రికార్డును అధిగమించానని ఖుర్షీద్ తెలిపారు. దీనికి సంబంధించి సాక్షులు ధ్రువీకరించిన పత్రాలు, వీడియో పుటేజీలు, ఫొటోలను గిన్నిస్‌బుక్ వారికి అందజేసి రికార్డు ధ్రువపత్రం పొందనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement