breaking news
computer keyboard
-
Lok sabha elections 2024: ‘రీడ్ ద లెటర్ బిట్వీన్’
ఇదేదో పజిల్లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కీబోర్డును మీదున్న అక్షరాలతో ఈ ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నాయి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు. అదెలా అంటే.. నేను.. ‘‘వికసిత్ భారత్ కోసం ఎవరు ఓటు వేయనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కీబోర్డులోని యూ అండ్ ఓ మధ్య ఉన్న లెటర్‌ను బిగ్గరగా చదవండి’’ అని భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ రెండు లెటర్స్ మధ్యనున్న అక్షరం ‘ఐ’. ఆ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ ‘ఐ’ అంటారు. సో... వారంతా తాము బీజేపీకి ఓటు వేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసినట్టేనని బీజేపీ భావిస్తోంది. మేము..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ ట్రెండ్‌నే అనుసరిస్తోంది. ‘‘నియంత నరేంద్ర మోదీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? కీబోర్డులో క్యూ, ఆర్ మధ్య ఉన్న లెటర్స్‌ను చదవండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇక్కడ క్యూ, ఆర్ మధ్య ఉన్నది డబ్ల్యూ, ఈ.. రెండక్షరాలను కలిపితే ‘మేము’ అనే అర్థం వస్తుంది. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని సందేశాన్నిచ్చేలా ఆప్ వైరల్ చేస్తోంది. పోలీసులు సైతం.. ఈ రెండు పార్టీలిలా ఉంటే.. సురక్షితమైన డ్రైవింగ్ గురించి అవగాహన కలి్పంచేందుకు ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ‘‘డ్రైవింగ్ చేస్తూ మీరు కీ బోర్డును చూస్తే.. క్యూ అండ్ ఆర్ మధ్యలో లెటర్స్ (డబ్ల్యూ, ఈ) చలాన్‌తో మిమ్మల్ని కలుస్తాయి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. అంటే మీరు కీబోర్డు చూస్తే వి (మేము) చలాన్ వేస్తామని అర్థమన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముక్కుతో చకచకా టైపింగ్!
గిన్నిస్ కోసం నగరవాసి వినూత్న యత్నం హైదరాబాద్, న్యూస్‌లైన్: నగరంలోని పాతబస్తీ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఖుర్షీద్హుస్సేన్ గిన్నిస్ రికార్డు కోసం వినూత్న ప్రయత్నం చేశారు. కంప్యూటర్ కీబోర్డుపై ముక్కుతో ఏ నుంచి జెడ్ వరకూ 53 సెకన్లలోనే టైప్ చేశారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సాక్షుల మధ్య ఈ ప్రక్రియను రికార్డును చేశారు. ముక్కుతో అత్యధిక వేగంగా టైప్ చేసిన రికార్డు ప్రస్తుతం దుబాయికి చెందిన ఓ అమ్మాయి పేరు మీద ఉందని, అయితే ఆమె 1.33 నిమిషాల్లో టైప్ చేయగా.. తాను 53 సెకన్లలోనే పూర్తిచేసినందున రికార్డును అధిగమించానని ఖుర్షీద్ తెలిపారు. దీనికి సంబంధించి సాక్షులు ధ్రువీకరించిన పత్రాలు, వీడియో పుటేజీలు, ఫొటోలను గిన్నిస్‌బుక్ వారికి అందజేసి రికార్డు ధ్రువపత్రం పొందనున్నట్లు చెప్పారు.