అనుమానాస్పదంగా ఇద్దరి మృతి | Two suspicious deaths | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా ఇద్దరి మృతి

Sep 30 2013 3:18 AM | Updated on Sep 1 2017 11:10 PM

అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృ తి చెందిన సంఘటన రాయికోడ్ మండలంలోని చిమ్నాపూర్‌లో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్, స్థానికు ల కథనం ప్రకారం

రాయికోడ్, న్యూస్‌లైన్: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృ తి చెందిన సంఘటన రాయికోడ్ మండలంలోని చిమ్నాపూర్‌లో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్, స్థానికు ల కథనం ప్రకారం.. అందోల్ మండ లం డాకూర్‌కు చెందిన పెద్దగొల్ల రాజు (30)కు మండలంలోని జంమ్గి గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ రెండో కూతురు సంధ్యతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా శనివారం రాజు తన భార్య తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆ దివారం ఉదయం స్వగ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. అయితే జంమ్గి నుంచి బయల్దేరిన అతడు చి మ్నాపూర్ వచ్చి మద్యం సేవించాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఓ దాబా పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మధ్యాహ్నం 4.30 గంటలవుతున్నా ఆ వ్యక్తి అక్కడి నుంచి కదలకపోవడంతో స్థానికులు దగ్గరికి వెళ్లి చూడగా నోట్లో నుంచి బురుగులు వచ్చిన ఆనవాళ్లను కనిపించాయి.
 
 దీంతో వారు పోలీసుల కు సమాచారం అందించారు. ఎస్‌ఐ  సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా  అప్పటికే రాజు మృతి చెందాడు. విషయం మృతుడి మామకు తెలియడం తో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించాడు. నా లుగేళ్ల క్రితం తన తన పెద్ద అల్లుడు సై తం మద్యం సేవించి చిమ్నాపూర్‌లోనే చనిపోయాడని రోదిస్తు తెలిపాడు. మృ తుడి తల్లిదండ్రులు వచ్చిన అనంతరం శవాన్ని పోస్టుమార్టంకు తరలిస్తామని ఎస్‌ఐ చెప్పారు. అయితే సంగారెడ్డిలోని పెట్రోలు బంక్‌లో పని చేస్తాడని, అక్కడి కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చాడోనని మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
 
 నాగిరెడ్డిగూడెంలో.. 
 జిన్నారం: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిన్నా రం మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.  ఏఎస్‌ఐ మల్లారెడ్డి కథనం ప్రకారం.. నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల అశోక్ (35) ఎప్పటిలాగే శనివా రం రాత్రి ఇంట్లో నిద్రించాడు. ఉదయం తెల్లవారేసరికి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ మల్లారెడ్డి సందర్శిం చారు. మృతికిగల కారణాలపై ఆరా తీశారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్‌ఐ తెలిపారు. అయితే ఈ మృతిపై అశోక్ తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement