లైంగికదాడికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్ | two peoples arested against attempt rape | Sakshi
Sakshi News home page

లైంగికదాడికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్

Sep 24 2013 3:51 AM | Updated on Oct 17 2018 5:51 PM

లారీలో ఓ మూగ మహిళపై లైంగికదాడికి పాల్పడి, కిందికి తోసివేసిన ఇద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపినట్లు చేర్యాల సీఐ జితేందర్ తెలిపారు.

బచ్చన్నపేట, న్యూస్‌లైన్ :
 లారీలో ఓ మూగ మహిళపై లైంగికదాడికి పాల్పడి, కిందికి తోసివేసిన ఇద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపినట్లు చేర్యాల సీఐ జితేందర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై షాదుల్లాపాషాతో కలిసి మాట్లాడారు. తమ్మడపల్లి సర్పంచ్ బేజాటి సిద్దులు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
 సీఐ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో ని హుస్సేని దర్గా సమీపంలో నివాసముంటు న్న మూగ, చెవిటి మహిళ ఈ నెల 21న మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆమె రోడ్డుపై నిల్చుని ఉండగా అదే సమయంలో మహారాష్ట్ర నుంచి విశాఖపట్టణానికి డ్రమ్‌ల లోడ్‌తో వెళుతున్న డ్రైవర్ లారీని ఆపి ఆమెకు మాయమాటలు చెప్పి ఎక్కించుకున్నాడు. అందులో కృష్ణా జిల్లా కంచికచెర్ల గ్రామానికి చెందిన లారీ యజమాని, డ్రైవర్ ఎర్రగుంట వెంకట్‌రావుతోపాటు అదేజిల్లా వీర్లపాడుకు చెందిన క్లీనర్ కనకంచి రామయ్య ఉన్నాడు. వారిద్దరు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపరచడమేగాక, తమ్మడపల్లి గ్రామసమీపంలో లారీ కదులుతుండగానే ఆమెను కిందికి నెట్టేశారు. గ్రామస్తుల చొరవతో దుండగులతోపాటు లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు సమయస్ఫూర్తితో, సాహసోపేతంగా వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు.
 
  పోలీసులకు సమాచారం అందగానే చుట్టుపక్కల పీఎస్‌లను అలర్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. దేవరుప్పుల ఎస్సై వెంకటేశ్వర్‌రావు పారిపోతున్న లారీని పట్టుకున్నాడన్నా రు. బచ్చన్నపేట ఎస్సై షాదుల్లాబాబాతోపాటు తాను అదే రాత్రి దేవరుప్పులకు వెళ్లి దుండగులను గుర్తించినట్లు తెలిపారు. బాధిత మహిళ బ్యాగులో ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా ఆమె అక్క రోజీని ఇక్కడకు రప్పించి నట్లు తెలిపారు. కరుణాపురంలోని బధిర ఉపాధ్యాయులను పిలిపించి, బాధిత మహిళ సైగల ద్వారా వివరాలు సేకరించామని వివరించారు. నిర్భయ చట్టంతోపాటు కిడ్నాప్, లైంగికదాడి, హత్యాయత్నం కింద వెంకటరావు, రామయ్యపై  కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఎస్పీ కూడా ఇక్కడి గ్రామస్తులతోపాటు పోలీ సుల కృషిని అభినందించారని చెప్పారు. ఆయన వెంట ట్రైనీ ఎస్సై వేణుగోపాల్, ఏఎస్సై కిషన్ నాయక్, హెడ్‌కానిస్టేబుల్ రవీంద్రనాథ్, కానిస్టేబుళ్లు నరేందర్‌రావు,సంపత్, వెంకన్న, యాలాద్రి ఉన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement