మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం | two more bodies recovered from beas river | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Jul 21 2014 12:47 AM | Updated on Sep 2 2017 10:36 AM

హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు ఆదివారం పోలీసులకు అభ్యమయ్యాయి.

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు ఆదివారం పోలీసులకు అభ్యమయ్యాయి. వాటిని కరీంనగర్‌కు చెందిన శ్రీనిధి, మరొకరు బాచుపల్లికి చెందిన నిశితారెడ్డిగా పోలీసులు గుర్తించారు. జూన్ 8న విజ్ఞానయాత్ర కోసం వెళ్లిన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో 24 మంది లార్జీడ్యాం వరద నీటి ప్రవాహం కారణంగా బియాస్‌నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.  ఈ ఇద్దరి మృతదేహాలతో కలిపి ఇప్పటివరకు 23 మృతదేహాలను బయటకు తీశారు. మరో విద్యార్థి శ్రీహర్ష, టూర్ ఆపరేటర్ ప్రహ్లాద్ మృతదేహాల జాడ తెలియాల్సి ఉంది.  మృతదేహాలను విమానంలో హైదరాబాద్‌కు తరలించనున్నారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement